నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:31

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు అయినట్లు తెలిసింది.

హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ - 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం… పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది...

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:28

చంద్రబాబును విచారిస్తున్న సిఐడి బృందం

సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది.

అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు.

సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.

ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు విచార‌ణ‌లో షరతులు

చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని ఆదేశించిన కోర్ట్ .

ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం

విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతి.

9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతి

ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం.

కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు.

విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు.

న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి..

విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు

విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం అందుబాటులో ఉంచాలి.

మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం

ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్.

విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉండడానికి అనుమతి

బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు.

న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.

విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం.

దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని సమర్పించాలని ఆదేశించిన కోర్ట్

సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ.

రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:25

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో నేడు జమిలి కమిటీ సమావేశం

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది.

ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ నెల 23న కమిటీ సమావేశం జరుగుతుందని కోవిద్ ఇటీవల ఒడిశాలో చెప్పిన విషయం తెలిసిందే.

లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి, వీలయినంత త్వర లో సిఫార్సులు చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న కోవింద్ నే తృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే,

ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్‌కె సింగ్ , లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ చీఫ్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

లోక్‌సభలో కాం గ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని కూడా కమిటీలో సభ్యుడుగా ఉన్నప్పటికీ తాను కమిటీలో ఉండబోవడం లేదని ఆయన ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కాగా ఈ సమావేశం కే వలం పరిచయ సమావేశం మాత్రమేనని, ఈ సమావేశంలో తమకిచ్చి న అంశంపై ముందుకు వెళ్లడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌పై కమిటీ చరిస్తుందని కమిటీ సన్నిహిత వర్గాలు తెలియజేశారు.

కమిటీ విధి విధానాల గురించి న్యాయశాఖ అధికారులు ఇదివరకే కోవింద్‌కు వివరించారు. అంతేకాకుండా అమిత్ షా, కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌లు కోవింద్‌ను కలిశారు.

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 10:32

600 కోట్ల వజ్ర గణపతిని చూశారా.?

గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు.

182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి,

ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.

ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు.

మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.

15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 10:25

చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి..

టీడీపీ అధినేత చంద్రబాబును ఈరోజు, రేపు సీఐడీ అధికారులు విచారించనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే..

ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాలును అధికారులు సిద్ధం చేశారు.

చంద్రబాబును తొమ్మిది మంది సీఐడీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతిస్తారు.

సీఐడీ విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. కాసేపట్లో చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.

ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభమవుతుంది.

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సీఐడీ అధికారులు బస చేశారు. కాసేపటి క్రితమే వారు గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు బయల్దేరారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:46

Shamshabad: శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు 300 మంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది.

దీంతో రాష్ట్రంలో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.

శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఖతార్‌ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్‌ ఎందుకు చేస్తున్నారో అర్థంకాని గందరగోళ పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది.

దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికుల మైండ్‌ బ్లాంక్ అయ్యింది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:43

నేటి నుంచి ఆసియా గేమ్స్ సమరం

ఆసియా గేమ్స్‌-2023 ప్రధాన ఈవెంట్లకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ మెగా సంగ్రామంలో భారత క్రీడాకారులు పతకాల వేటను ప్రారంభించడానికి రెడీ అయ్యారు.

భారత్‌ నుంచి వివిధ క్రీడాంశాల్లో మొత్తం 655 మంది క్రీడాకారులు ఈ మెగా సమరంలో పోటీ పడుతున్నారు. గత ఎడిషన్‌ 2018లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌ పోటీల్లో భారత్‌ మొత్తం 70 పతకాలు గెలుచుకుంది.

ఇదే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక ఈసారి చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మన దేశ ఆటగాళ్లు వంద(100) పతకలతో సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, మహిళల క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌, రోయింగ్స్‌ వంటి క్రీడలు మొదలయ్యాయి. కానీ అధికారికంగా శనివారం నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఈ మెగా టోర్నీ ప్రధాన ఈవెంట్లు జరుగుతాయి.

బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, పురుషుల క్రికెట్‌, టెన్నిస్‌, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, సెపక్‌ తక్రా తదితర క్రీడా అంశాల్లో భారత ఆటగాళ్లు పతకాల కోసం విదేశీ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు.

ప్రస్తుతం అన్ని క్రీడా విభాగాల్లో భారత్‌ దూసుకుపోతుంది. చిన్న చిన్న పోటీల్లో కాకుండా పెద్ద ఈవెంట్‌లలోనూ భారత క్రీడాకారులు సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌లలోనూ పతకాలు సాధిస్తూ భారత ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికల్లో దేశ కీర్తి, ప్రతిష్టలను మరింతగా మెరుగుపరుస్తున్నారు.

ఈసారి అత్యధిక స్వర్ణాలు ఖాయం..!

కొన్ని క్రీడాంశాల్లో భారత్‌ స్వర్ణ పతకాలు గెలవడం ఖాయం. ముఖ్యంగా భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.

ఈ ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడిషన్‌ ఆసియా గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించన విషయం తెలిసిందే.

ఈసారి కూడా అతను పసిడితో మెరుస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక తొలిసారి ఆసియా క్రీడాల్లో ప్రవేశ పెట్టిన క్రికెట్‌లో కూడా భారత్‌ పురుషుల, మహిళల రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు హాకీలోనూ టీమిండియా పటిష్టంగా ఉంది.

హాకీలో పురుషుల జట్టు, మహిళల జట్టు పసిడి గెలుచుకుంటుందనడంలో సందేహంలేదు. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి పురుషుల డబుల్స్‌ జోడీ ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల సింగిల్స్‌లో సింధుపై భారీ ఆశలు ఉన్నాయి.

ఈ ఏడాది ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు ఆసియాగేమ్స్‌ పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబీ శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌లు కూడా పతకాలు గెలుచుకోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:40

నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్

హైదరాబాద్ : నేడు నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ రానున్నాడు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు..

హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41 ఏసీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు హైకోర్టు సూచించింది.

ఆదేశాల నేపథ్యంలో నవదీప్‌కు 41 ఏసీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:36

కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి (76) శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటుతో మరణించారు.

కాగా హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నేత హరీశ్వర్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కొప్పుల హరీశ్వర్ రెడ్డితో పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు...

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:34

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.

నేడు శనివారం 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శుక్రవారం 72,650 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.

4 గంటలకు స్వర్ణ రథంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.